అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర: కన్నీటిపర్యంతమైన రాజా కృష్ణమూర్తి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అరోరా, అమెరికా
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా నగరంలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయంపై ఓ టీనేజర్ సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో ఆలయంలోనే ఉన్న భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తుపాకీ పనిచేయకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష ప్రచారమే హింసకు ఆజ్యం పోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.