తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వినాయక నిమజ్జనం వేళ పాఠశాలలకు సెలవులు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు గణేష్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో నేటి సెలవుకు బదులుగా నవంబర్ 14న స్కూళ్లు పనిచేస్తాయని కలెక్టర్లు తెలిపారు.