ఓటర్ల జాబితా సవరణ గడువు ముగింపు: నేడే తుది గడువు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు మరియు కొత్త క్లెయిమ్ల దరఖాస్తులను సమర్పించడానికి బుధవారంతో తుది గడువు ముగియనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అర్హులైన ప్రజలు తమ పేర్ల నమోదుకు ఇది ఆఖరి అవకాశమని అధికారులు తెలిపారు. నవంబర్ తొమ్మిదో తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.