సినీ ప్రియులకు గుడ్ న్యూస్: గణేశ్ ఆచార్య బయోపిక్ ట్రైలర్ విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు గణేశ్ ఆచార్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గణేశ్ డస్ట్ టు స్టార్ డస్ట్ సినిమా ట్రైలర్ విడుదలైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి గణేశ్ ఆచార్య స్వయంగా దర్శకత్వం వహించగా, ఆయన పాత్రలో శివాంశు సోని నటిస్తున్నారు. కష్టాల నుంచి స్టార్డమ్ వరకు ఆయన ప్రయాణాన్ని వివరిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి.