కర్నూలులో నీటి ఎద్దడి: రెండడుగుల మట్టి విగ్రహాలకే అనుమతి

రిపోర్టర్: విజయ్ స్థలం: కర్నూలు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి కారణంగా వినాయక నిమజ్జనానికి ఆటంకం ఏర్పడింది. కర్నూలు నగరంలో తుంగభద్ర నది అడుగంటడంతో ఘాట్ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనానికి అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని మండపాల్లో కేవలం రెండు అడుగుల లోపు మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.