విద్యుత్ వినియోగదారులకు రూ. 629 కోట్ల మేర ఉపశమనం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాదీ శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని సర్దుబాట్ల తర్వాత రూ.629.35 కోట్లు ట్రూడౌన్ చేసేందుకు ఏపీఈఆర్సీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్, ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ డిస్కంలు పలు మొత్తాలను సర్దుబాటు చేశాయని కమిషన్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.