విజయనగరం వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం నిధులను మళ్లించడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తున్నా, నాబార్డు నిధుల విడుదలలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అక్టోబరులో కొత్త ప్రవేశాలు జరగనుండటంతో, విద్యార్థుల వసతి, తరగతి గదుల కోసం ఆరు బ్లాకుల నిర్మాణాన్ని నవంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.