బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: జిల్లా అధికారి హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత సృష్టించినా లేదా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన దుకాణాల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని, ప్రజలు ఫిర్యాదు చేయాలని కోరారు.