భారీ వర్షాల బీభత్సం: యానాంతో పాటు పలు ప్రాంతాలు జలమయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: యానాం
తెలుగు రాష్ట్రాలతో పాటు యానాంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు, ఇళ్లలోకి మురుగు నీరు వచ్చి చేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ, గుంటూరు జిల్లాలలోనూ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ముమ్మిడివరంలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.