మంథనిలో ఘనంగా జల్సా సీరత్ ఉన్ నబీ కార్యక్రమం

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని జల్సా సీరత్ ఉన్ నబీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్ఎల్బీ ఫంక్షన్ హాల్లో సాలేహ మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర, బోధనలు, మానవతా విలువలను వివరించి సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు.