ది ప్యారడైజ్ చిత్రానికి సమ్మక్క పేరు కూడా పరిశీలించామన్న నాని
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు ప్రత్యామ్నాయ టైటిల్‌గా సమ్మక్క పేరును కూడా ఆలోచించామని నాని తెలిపారు. ఇందులో సోనాలి కులకర్ణి పోషించిన తల్లి పాత్ర కథలో ఎంతో కీలకమని, ఇది కేవలం యాక్షన్ సినిమా కాదని, తల్లి కొడుకుల మధ్య సాగే భావోద్వేగ కథ అని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న విడుదల కానుంది.