నాపై వస్తున్న బ్రేకప్ ప్రచారంపై స్పందించిన నటి రీతూ చౌదరి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
మా మధ్య ప్రేమ లేదని, కేవలం స్నేహం మాత్రమే ఉందని నటి రీతూ చౌదరి స్పష్టం చేశారు. డీమాన్ పవన్‌తో విభేదాలు, బ్రేకప్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణనిచ్చారు. స్నేహితుల మధ్య మనస్పర్థలు రావడం సహజమేనని, దీనిని బ్రేకప్‌గా చిత్రీకరించడం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పవన్ పెట్టిన పోస్ట్ కారణంగా ఒక్కరోజులోనే తనకు భారీగా ఫాలోవర్స్ పెరిగినట్లు రీతూ చౌదరి తెలిపారు.