తెనాలి మున్సిపల్ అధికారుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: గుంటూరు
అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ అధికారుల పనితీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. బుధవారం వర్షంలోనే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయకపోవడాన్ని నిలదీశారు. పట్టణంలో వర్షపు నీటికి అడ్డుపడిన వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగింపజేసి, ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని స్థానికులకు తక్షణ సూచనలు చేశారు.