విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు తప్పని తిప్పలు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్టీసి బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు ప్రాణాలకు తెగించి వేలాడుతూ ప్రయాణిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఇరవై ఐదు బస్టాప్లు ఉన్నప్పటికీ బస్సులు నిలపడం లేదని వారు వాపోయారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా బస్సులు కేటాయించాలని, నిబంధనలు పాటించని సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.