రికార్డు ధరకు ఆటోనగర్ వినాయక లడ్డూ దక్కించుకున్న అనుమాస ప్రసన్న

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధనపేట ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో స్థానిక భక్తురాలు అనుమాస ప్రసన్న రూ.1,70,777 వెచ్చించి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. తీవ్ర పోటీ మధ్య సాగిన ఈ వేలం పాట పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.