జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత స్వయంగా నీటిని విడుదల చేసిన రైతులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంటలు ఎండిపోతున్నాయని సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో, ఆగ్రహించిన రైతులు స్వయంగా ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో అధికారులు గేట్లు తిరిగి మూసివేయగా, ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.