బొందుగుల సర్పంచ్ అక్రమాలపై ఎంపీఓకు వార్డు సభ్యుల ఫిర్యాదు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బొందుగుల గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి సర్పంచ్ ఎల్లయ్యపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు ఎంపీఓ కిషన్కు శనివారం ఫిర్యాదు చేశారు. తీర్మానాలు లేకుండా నిధులు ఖర్చు చేస్తున్నారని, కార్యదర్శి బదిలీని ఆపాలని డిమాండ్ చేశారు.