'రూ.86 కోట్లకు లెక్కలు ఎక్కడ?': ఏలూరు జిల్లాలో దేవాదాయ శాఖ అవినీతిపై విమర్శలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లాలోని వివిధ ఆలయాల్లో 2024-25 వరకు రూ.86.21 కోట్ల విలువైన ఆడిట్‌ అభ్యంతరాలు కొండలా పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కామవరపుకోట, ద్వారకాతిరుమల, కొయ్యలగూడెం తదితర మండలాల్లోని దేవాలయాల్లో భక్తుల కానుకలు, భూముల కౌలు, లీజుల ఆదాయాన్ని పొంతన లేని ఖర్చులు రాసి పక్కదారి పట్టిస్తున్నారని తేలింది. మొత్తం 28,592 అభ్యంతరాలు వ్యక్తమైనా సగానికి కూడా ఈవోలు సమాధానాలు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.