పొదలకూరులో ఘనంగా పోలేరమ్మ తల్లి రెండో చద్ది

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి రెండో చద్ది కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వెంకటగిరి జాతర ఆసాదు అంజయ్య ఆధ్వర్యంలో ఈ సంప్రదాయ వేడుకలు జరిగాయి. అమ్మవారి జాతర మహోత్సవాలు అక్టోబర్ 6 నుంచి 8 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

అక్టోబర్ 8న అమ్మవారి గ్రామోత్సవం, ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. సెప్టెంబర్ 22, 29 తేదీల్లో చాటింపు కార్యక్రమాలు ఉంటాయని వారు పేర్కొన్నారు.