తెలంగాణ విమోచన దినాన గర్వంగా ఎగిరిన కాషాయ జెండాలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్లో పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి, రైల్వే స్టేషన్ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.