ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల రెన్యువల్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాప్స్ యజమానుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ, రెన్యువల్ గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా, ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.1,179.63 కోట్లు వసూలయ్యాయి. మిగతా బకాయిలు మరియు రెన్యువల్ ప్రక్రియను పొడిగించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.