తుపాను విషాద బాధితులను పరామర్శించి నిత్యావసరాలు అందించిన కూటమి నాయకులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామంలో గత తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలను కూటమి నాయకులు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పిన నేతలు, మానవతా దృక్పథంతో నూట కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూటమి నాయకులు భరోసా ఇచ్చారు.