హైదరాబాద్లో నకిలీ ఆధార్ కార్డుల దందా గుట్టురట్టు: వ్యక్తి అరెస్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

ఆధార్ మరియు పాన్ కార్డులలోని వివరాలను అక్రమంగా మారుస్తూ నకిలీ పత్రాలు తయారు చేస్తున్న చిలక మహదేవ్ను శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ డి. కృష్ణ మోహన్ తెలిపారు. జల్పల్లికి చెందిన నిందితుడు బుద్వేల్లో ఆన్లైన్ సర్వీసెస్ కేంద్రం నిర్వహిస్తూ సులభంగా డబ్బు సంపాదించేందుకు సాఫ్ట్వేర్ ద్వారా ఆధార్ కార్డుల మార్పునకు పాల్పడుతున్నాడని, అతడి నుంచి అరవై నకిలీ ఆధార్ కార్డులతో పాటు ల్యాప్టాప్, ప్రింటర్, ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.