ఏపీలో ఏవియేషన్ హబ్ ఏర్పాటుకు మెల్‌స్టార్ సంస్థ ఆసక్తి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ఏపీని ఏవియేషన్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయవాడ, భోగాపురం, కర్నూలు విమానాశ్రయాల్లో మెయింటెనెన్స్, రిపేర్ కేంద్రాల ఏర్పాటుకు మెల్‌స్టార్ ఏవియేషన్ ఆసక్తి చూపింది. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాలని మంత్రి వారికి సూచించారు. అలాగే శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ రూ.300 కోట్ల పెట్టుబడులపై చర్చించింది.