ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

అమరావతిలోని సచివాయలంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్ అధ్యక్షతన ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య పథకంపై జరిగిన సమావేశంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడులోని ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్య సేవలు అందించాలని, ఎయిడెడ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని ఈ భేటీలో కోరారు.