ఉద్యమకారుల హక్కుల పోరాటానికి సారథిగా నియమితులైన గంజి చందు
రిపోర్టర్: G SUDHEER KUMAR
స్థలం: బాన్సువాడ
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని రాష్ట్ర ఉద్యమకారుల సహాయ కమిటీ కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు గంజి చందు తెలిపారు. బాన్సువాడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు భాషబోయిన రవీందర్ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉద్యమ సమయాన అందించిన పోరాట సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినందుకు రవీందర్ యాదవ్ కు గంజి చందు కృతజ్ఞతలు తెలిపారు. మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా తనవంతు కృషిచేస్తానని స్పష్టం చేశారు.