కర్నూలులో హెచ్ఆర్సీ ఛైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి బాధ్యతల స్వీకరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కర్నూలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి కర్నూలులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈయనతో పాటు జ్యుడీషియల్ సభ్యుడిగా విశ్రాంత జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా మనోహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తొలి రోజే వారు వంద ఫిర్యాదులపై విచారణ జరిపారు. అందులో సగం వరకు కమిషన్ పరిధిలో రావని నిర్ధారించి, మిగిలిన ఫిర్యాదుల్లో బాధితులు అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.