సూర్యాపేట జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: సునీల్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి సమర్థవంతంగా చేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.