సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు: సురక్షితంగా కాపాడిన స్థానికులు
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లగా అలల ఉద్ధృతికి బోటు అదుపుతప్పింది. స్పందించిన స్థానిక జువ్వలదిన్నె, పాత కడపాలి మత్స్యకారులు సాహసించి సముద్రంలోకి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించి మత్స్యకారులను అభినందించారు.