కేంద్రంపై మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ముస్లింల అభివృద్ధిపై గణాంకాలు కోరని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు డెమొగ్రఫీ కమిషన్ పేరుతో మతాలవారీగా ఆస్తుల వివరాలు సేకరించడంపై మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాలవారీగా భూములు, వాహనాల కొనుగోళ్లు, పాఠశాల ప్రవేశాలు వంటి వివరాలు సేకరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించడం రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. గతంలో ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆడే అడిగేవారు లేరని విమర్శించారు.