హైదరాబాద్ బస్టాండ్లలో భారీ రద్దీ: ప్రయాణికుల కోసం ఏడు వేల ప్రత్యేక బస్సులు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని, రద్దీని నియంత్రించడానికి ఏడు వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వెల్లడించారు. జేబీఎస్, ఎంజీబీఎస్తో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బోర్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని గ్రేటర్ ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్ తెలిపారు.