బావిలో పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
కావలి పట్టణంలో ప్రమాదవశాత్తు పాడుపడిన బావిలో పడిపోయిన కేత సుజాతమ్మ అనే వృద్ధురాలిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఆమె ఎడమ కాలుకు గాయమవడంతో, వెంటనే 108 సిబ్బంది సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు.