గిరిజన గ్రామాల అధికారిక వివరాలు కోరుతూ సిడిపిఓకు సమాచార హక్కు దరఖాస్తు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.మాడుగుల
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండల పరిధిలోని గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కోరుతూ ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి మద మత్సలింగం సమాచార హక్కు చట్టం -2005 కింద సిడిపిఓ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించారు. మండలంలోని పంచాయతీల వారీగా ఆయా పంచాయితీల పరిధిలోని గ్రామాల సంఖ్య, గ్రామాల పేర్లతో కూడిన అధికారిక రికార్డుల నకళ్లను అందించాలని ఆ దరఖాస్తులో స్పష్టంగా కోరారు.