రాజమహేంద్రవరంలో ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన డీజీపీ

రిపోర్టర్: సతీష్ స్థలం: తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో 7వ ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రారంభించారు. నేరాల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌లను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలోనూ 20 మందితో 'క్లిక్‌' బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల్లో తిరుమల తరహాలో కంపార్ట్‌మెంట్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.