ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలికిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రజల నుంచి అపారమైన ఆదరణ లభించిందని, రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని ఆయన ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.