కెటిఆర్ పిఎ, ప్రొలకు హైకోర్టులో ఊరట లభించింది
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేశ్‌లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో వాగ్వాదం మరియు దూషణల కేసులో తదుపరి విచారణ వరకు వారిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.