సిరిసిల్ల అభివృద్ధి చూసి కొడంగల్లో చేయాలంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: సిరిసిల్ల
సిరిసిల్లకి వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూసి కొడంగల్లోనూ అదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన వెధవను నేనే అని అక్కడి ప్రజలకు ఏం చెప్తావంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ తీవ్రస్థాయిలో నిలదీశారు.