వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలపై కురుగొండ్ల రామకృష్ణ సమీక్ష

రిపోర్టర్: శివ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగు గంగ గెస్ట్ హౌస్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూరగోండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల వ్యూహాలు, పార్టీ శ్రేణుల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.