దిల్లీలో పదహారేళ్ల బాలికిపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

దిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటనలో ముగ్గురు మైనర్లతో పాటు పంతొమ్మిదేళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ పన్నెండో తేదీన ఈ దారుణం జరగగా, కుషక్ రోడ్డు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కత్తిపోట్లతో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ శోభిత్ డి సక్సేనా తెలిపారు.