దారకొండలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలో ఆదివారం కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పుట్టపల్లి సత్యవతి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసినట్లు వీడియోలో వెల్లడించారు.