యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు భారత బ్యాటింగ్ కోచ్ కోటక్ మద్దతు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

అవకాశం కోసం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కష్టపడి పని చేయాలని భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ స్పష్టం చేశారు. జట్టులో తీవ్ర పోటీ ఉందని, పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశాలు రాకపోవడాన్ని అన్యాయంగా చూడకూడదని తెలిపారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని, అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడని ప్రశంసించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల అనుభవం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని కోటక్ పేర్కొన్నారు.