వరంగల్ ఎంజీఎం వద్ద పోలీసుల తీరుపై మహిళల ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్‌ను అడ్డుకొని దాడి చేసిన పోలీసుల తీరుపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులపై ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు మండిపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.