గణేష్ ఉత్సవాలు నిబంధనలు పాటించాలి: ఎస్‌హెచ్‌ఓ మేడా ప్రసాద్

రిపోర్టర్: రాము స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సర్పంచులు, ఉత్సవ కమిటీ సభ్యులతో ఎస్‌హెచ్‌ఓ మేడా ప్రసాద్ సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.