స్మార్ట్ ఫోన్ నే బాడీ కెమెరాగా మార్చిన ఏలూరు పోలీసులు
రిపోర్టర్: రమేష్
స్థలం: Eluru
పోలీసుల నిఘాను మరింత పటిష్ఠపరిచేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ కేపీఎస్ కిశోర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలీసుల స్మార్ట్ఫోన్నే బాడీ కెమెరాగా, జీపీఎస్ పరికరంగా మార్చి పుర ఎన్నికల విధుల్ లో విజయవంతంగా వినియోగించినట్లు వెల్లడించారు. జిల్లాలో నూట యాభై మందికి పైగా సిబ్బంది ఫోన్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు.