ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్‌ జీతానికి కలిపి చెల్లించనుంది. 2025 జనవరి నుంచి 1.82 శాతం, 2024 జులై నుంచి 2.73 శాతం చొప్పున డీఏలను వర్తింపజేస్తూ బకాయిల చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌కుమార్‌ ఖరారు చేశారు.