జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం: 109 మంది దుర్మరణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: జిబౌటి

ఆఫ్రికా దేశమైన జిబౌటి సముద్ర తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు మూడు వందల యాభై మంది వలసదారులతో యెమెన్ వైపు వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో ట తొమ్మిది మంది మృతి చెందారని, మరో నూట పదహారు మంది గల్లంతయ్యారని తెలిపారు. మృతులలో పదిహేను మంది చిన్నారులు ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొన్నాయి.