సూరసముద్రం చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు అధికారులు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని సూరసముద్రం చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.