తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ మహాసమాధి ఘట్టానికి ఏర్పాట్లు పూర్తి

రిపోర్టర్: రాము స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా వర్ధయ్యపాళెం మండలం బత్తలవల్లం ఏకం క్షేత్రంలో కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు క్షేత్ర నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులకు చివరి చూపునకు అనుమతి ఉంటుందని, వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.