అన్నం పెట్టడం లేదంటూ ప్రకాశం జిల్లాలో బాలుడి ఆవేదన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Prakasam District
తెలుగు Scribe ఎక్స్ వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా రాచవారిపాలెం వద్ద ఎనిమిదేళ్ల రామయ్య అనే బాలుడు బడిలో చదవాల్సిన వయసులో గొర్రెలు మేపుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తనకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని, నన్ను ఇంటికి తీసుకెళ్లాలని ఆ బాలుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. నర్రవాడ గ్రామానికి చెందిన ఈ చిన్నారి పడుతున్న వేదనపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.