పుత్తూరులో ఉపాధ్యాయుల సన్మానం.. గురువులే దేశానికి వెన్నెముక!

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పుత్తూరు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పుత్తూరు మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు.

తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తారని, అక్షరం నేర్పిన ప్రతి గురువూ దైవంతో సమానమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఒక తపస్సు అని, రేపటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఆయన ఉద్ఘాటించారు.